అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకుని అహం ప్రదర్శిస్తున్నావు: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

- ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేశావని హరీశ్ విమర్శ
- జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి పాలన కొనసాగిస్తున్నారని మండిపాటు
- కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన అన్నావని, సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నావని, ప్రజలను ప్రతిరోజు కలుస్తా అన్నావని... కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేశావని హరీశ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లోని ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన కొనసాగిస్తున్నావని దుయ్యబట్టారు.